HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
WHEN CAN I GET COVID 19 VACCINE HERE IS THE ANSWER BA
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ నాకు ఎప్పుడు వేస్తారు?.. ఇదే మీ ప్రశ్నా?
కరోనా వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ క్రమంలో నాకు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనే దానిపై ప్రజల్లో సందేహం నెలకొంది. ‘నాకు కరోనా వ్యాక్సిన్’ ఎప్పుడు వేస్తారు?’ అని మీకు అనుమానం ఉంటే దానికి సమాధానం తెలుసుకోండి.
News18 Telugu | December 23, 2020, 3:47 PM IST
1/ 7
కరోనా వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ క్రమంలో నాకు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనే దానిపై ప్రజల్లో సందేహం నెలకొంది. ‘నాకు కరోనా వ్యాక్సిన్’ ఎప్పుడు వేస్తారు?’ అని మీకు అనుమానం ఉంటే దానికి సమాధానం తెలుసుకోండి.
2/ 7
మీరు హెల్త్ వర్కర్ (డాక్టర్, నర్సులు, కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తించే వారు) లేదా కరోనా వారియర్ అయితే మీకు తొలిదశలోనే కరోనా వ్యాక్సిన్ లభిస్తుంది.
3/ 7
మీరు పోలీసులా, ఆర్మ్డ్ సర్వీసెస్లో పనిచేస్తారా? మున్సిపల్ వర్కరా?, డ్రైవర్, టీచర్లా? అయితే మీకు ఆ తర్వాత ప్రాధాన్యం లభిస్తుంది.
4/ 7
మీరు 50 ఏళ్ల కంటే పెద్దవారు అయితే, తదుపరి ప్రాధాన్యం మీకే ఇస్తారు.
5/ 7
పై కేటగిరీలో కానివారు అయినా కూడా ఎవరికైనా ఆస్థమా, గుండెపోటు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వారికి కూడా ప్రాధాన్యతా క్రమంలో కరోనా వ్యాక్సిన్ లభిస్తుంది.
6/ 7
ఇంకో విషయం ఏంటంటే, మీరు కోవిడ్ 19 హాట్ స్పాట్ లో ఉండే వారు అయితే, మీకు టాప్ ప్రయారిటీలో కరోనా వ్యాక్సిన్ వేస్తారు.
7/ 7
పైన చెప్పిన వాటిలో ఏ కేటగిరీకి చెందని వారు అయితే, మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. కాబట్టి, మీకు కొంచెం ఆలస్యంగా వస్తుంది.