WEST BENGAL DECIDED TO IMPLEMENT LOCKDOWN FOR TEN DAYS IN AUGUST TO CONTROL CORONA VIRUS SPREAD AK
ఆ రాష్ట్రం కీలక నిర్ణయం.. ఆగస్టులో 10 రోజులు లాక్డౌన్
ఆగస్టు 31 వరకు బెంగాల్లో లాక్డౌన్ నిబంధనలను అమలు చేయాలని గతంలోనే నిర్ణయించిన మమత బెనర్జీ.. తాజాగా ఆగస్టులో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని డిసైడయ్యారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక నగరాలు, పట్టణాల్లో కొన్ని రోజుల పాటు లాక్డౌన్ విధించేందుకు పాలకులు అధికారులు సిద్ధమవుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సైతం తమ రాష్ట్రంలో లాక్డౌన్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
2/ 7
ఆగస్టు 31 వరకు బెంగాల్లో లాక్డౌన్ నిబంధనలను అమలు చేయాలని గతంలోనే నిర్ణయించిన మమత బెనర్జీ.. తాజాగా ఆగస్టులో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని డిసైడయ్యారు.
3/ 7
వారంలో రెండు రోజుల పాటు లాక్డౌన్ విధించేందుకు సిద్ధమైన బెంగాల్ ప్రభుత్వం... ఇందుకు సంబంధించి తేదీలను కూడా ఖరారు చేసింది.
4/ 7
ఆగస్టు 2, 5, 8, 9, 16, 17, 23, 24, 31 తేదీల్లో పశ్చిమ బెంగాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు కానుంది.
5/ 7
ఇక రేపు కూడా బెంగాల్లో లాక్డౌన్ ఉండనుంది. లాక్డౌన్ అమలులో ఉండే రోజుల్లో రైళ్లు, విమానాలు రద్దు కానున్నాయి.
6/ 7
దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది.
7/ 7
బెంగాల్లో ఇప్పటివరకు 60,830 కరోనా కేసులు నమోదుకాగా, 19,502 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య వెయ్యి దాటిపోయింది.