P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18 జూ అంటే ఒక ఆహ్లాదకర వాతావరణం.. టీవీలు, సినిమాల్లో కనిపించే ఎన్నో రకాల పక్షులు, జంతువులు జూలో చూసి మనం ఎంతగానో ఆనందపడతాం.. పక్షుల కిలకిలరావాలు.. జంతువుల అరుపులు విని ఆశ్చర్యానికి లోనవుతాం.. అయితే వాటిని చూసి ఆనందిస్తుంటాం.. ఆ జంతువులు, పక్షులకు ఏమైనా తినిపించాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ తినిపించే అవకాశం ఉండదు.. ఇలాంటి కోరికలు ఉన్నవారికి జూ అధికారులు ఓ ఆఫర్ ఇచ్చారు.
కరోనా ఎఫెక్ట్ మనుషులపైనా కాదు.. జంతువులపైనా భారీగా పడింది. ముఖ్యంగా జంతు ప్రదర్శనశాలకు వైరస్ దెబ్బ గట్టిగానే తగిలింది. లాక్ డౌన్, కర్ఫ్యూల కరాణంగా పూర్తిగా ఆదాయం కోల్పోయింది. దీంతో వణ్యప్రాణుల సంరక్షణ భారంగా మారింది. వాటికి ప్రతి రోజు తిండి పెట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో దాతల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు అధికారులు.. జంతువుల మనుగడ కోసం దాతలు ముందుకొచ్చి దత్తత తీసుకోవాలని అధికారుల కోరుతున్నారు.