ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 31,325 శాంపిల్స్ ని పరీక్షించగా 997 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 8,99,812కి చేరింది. వీరిలో 8,86,498 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,104 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో గత 24గంటల్లో ఐదుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 7,210కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,50,21,364 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.