ఇందులో భాగంగా ఆరోగ్యంగా ఉన్న 300 మంది వాలంటీర్లపై నాలుగో దశ క్లినికల్ ప్రయోగాలను నిర్వహిస్తారు. వీరికి ఒక డోసు కొవాగ్జిన్‌ను, మరో డోసు కింద కోవిషీల్డ్ టీకా ఇచ్చి పరీక్షిస్తారు. ఒక వ్యక్తికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి రెండు భిన్న కంపెనీల టీకా డోసులను ఇవ్వవచ్చా అని పరిశీలిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో అందుబాటులో ఉన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు రెండు వేర్వేరు టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా ఇన్‌యాక్టివేటెడ్ వైరస్‌ను ఉపయోగించి తయారు చేశారు. కొవిషీల్డ్ మాత్రం ఎడినో వైరస్ వెక్టార్ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు.(image credit - twitter - reuters)
డబ్ల్యూహెచ్‌వో వ్యాఖ్యల నేపథ్యంలో.. తాజా అధ్యయనం మెరుగైన ఫలితాలే ఇచ్చినప్పటికీ మరిన్న పరిశోధనలు జరగాల్సి ఉంది. దీనిపై నిపుణుల సమక్షంలో పూర్తి సమీక్ష జరగాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నాలుగో దశ ఔషధ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి వచ్చింది. అందులో మెరుగైన ఫలితాలు వస్తే వ్యాక్సిన్ మిక్సింగ్‌పై కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)