HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
VACCINE MAY NOT WORK FOR CORONA VIRUS STRAIN OF SOUTH AFRICA SAYS SCIENTISTS OF ENGLAND AK
CoronaVirus Vaccine: ఆ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు.. శాస్త్రవేత్తల అనుమానం
CoronaVirus Vaccine: డిసెంబర్ 18 కొత్త రకం కరోనా వైరస్‌ను కనుగొన్నట్టు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఈ వైరస్ విస్తరిస్తోందని వెల్లడించింది. ఈ కొత్త రకం కరోనా వైరస్‌కు 501Y.V2 అనే పేరు పెట్టారు.
News18 Telugu | January 5, 2021, 2:39 PM IST
1/ 6
ఢేి కరోనాకు వ్యాక్సిన్ సిద్ధమైంది. సీరం సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్‌తో పాటు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ డోసులను త్వరలోనే దేశ ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. (ఫ్రతీకాత్మక చిత్రం )
2/ 6
అయితే ఈ కరోనా వ్యాక్సిన్ కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా స్ట్రెయిన్లను నియంత్రించగలుగుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ నియంత్రణకు కరోనా వ్యాక్సిన్ పని చేయకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
3/ 6
డిసెంబర్ 18 కొత్త రకం కరోనా వైరస్‌ను కనుగొన్నట్టు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఈ వైరస్ విస్తరిస్తోందని వెల్లడించింది. ఈ కొత్త రకం కరోనా వైరస్‌కు 501Y.V2 అనే పేరు పెట్టారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
4/ 6
దక్షిణాఫ్రికాతోపాటు మరో నాలుగు దేశాల్లో ఈ కొత్త రకం వైరస్‌ను గుర్తించారు. బ్రిటన్‌లో కొనుగొన్న వైరస్‌కు వ్యాక్సిన్ పని చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు.. తాజాగా దక్షిణాఫ్రికా వైరస్ విషయంలో ఆందోళన చెందుతున్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
5/ 6
ప్రస్తుతం అందిస్తున్న వైరస్ కొత్త కరోనా స్ట్రెయిన్లను ఎదుర్కొంటుందన్నది ఎలాంటి ఆధారాలు లేవని బ్రిటన్ వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించగా... ఈ విషయాన్ని తేల్చేందుకు ఆరు వారాల సమయం పడుతుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు తెలిపారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
6/ 6
దక్షిణాఫ్రికాలో కనుగొన్న కొత్త రకం వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు నెల నుంచి ఆరు వారాల సమయం పడుతుందని ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీకి చెందిన జాన్ బెల్ తెలిపారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌లో మ్యుటేషన్లు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం )