ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒమిక్రాన్ భయం పట్టుకుంది. అపార ప్రాణ నష్టానికి కారణమైన డెల్టా వేరియంట్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దీంతో వ్యాక్సిన్ వేగవంతం చేయాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచదేశాలకు సూచించింది. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా సోకే ప్రమాదం తగ్గుతుందని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే భారత్‌లో ఇప్పటివరకు 18 సంవత్సరాలకు పైబడిన వ్యక్తులకే వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాగా, ఒమిక్రాన్ పిల్లలకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్ ఇవ్వాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీనేజర్లకు సైతం కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం)
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు సైతం ఇచ్చేందుకు అన్ని అనుమతులు పొందింది. దీనితో పాటు జైడస్ జైడస్ కాడిలా తయారు చేసిన ZyCoV-D వ్యాక్సిన్‌కు కూడా అపెక్స్ డ్రగ్ కంట్రోలర్ బాడీ ఆమోదం తెలిపింది. ZyCov-D, ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్ఏ -ఆధారిత నీడిల్ ఫ్రీ వ్యాక్సిన్. దీనికి 2021 ఆగస్టు 20న డ్రగ్ కంట్రోలర్ అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం..
కాగా, వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పిల్లలపై కోవాక్సిన్ చాలా మంచి రోగనిరోధక ప్రతిస్పందనను కనబర్చిందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘15 నుంచి18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరాన్ని మా పరిశోధనలు గుర్తు చేశాయి. (ప్రతీకాత్మక చిత్రం)
వారు పాఠశాలలు, కళాశాలలకు వెళుతుంటారు కాబట్టి ఇతరుల నుంచి వీరికి కరోనా సోకే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే 15 నుండి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది." అని డాక్టర్ అరోరా చెప్పారు. కోవాక్సిన్ పెద్దవారి కంటే పిల్లలలో మెరుగైన ఫలితాలను చూపించిందని డాక్టర్ అరోరా స్పష్టం చేశారు. పిల్లలపై జరిపిన వ్యాక్సిన్ ట్రయల్స్‌లో కోవాక్సిన్ మంచి రోగనిరోధక ప్రతిస్పందనను కనబర్చిందని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)