చైనా నుంచి ఆగ్రాకి వచ్చిన ఓవ్యక్తికి ఇవాళ కరోనా పాజిటివ్ గా తేలడం కలకలం రేపుతుంది. దీంతో అతడు ఉన్న భవనం చుట్టూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అతడి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం లక్నో ల్యాబ్‌కు పంపించారు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ వస్తే అతనిలో ఉన్నది ప్రమాదకర బీఎఫ్-7 వేరియంటా,కాదా అనేది తేలిపోనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
చైనా నుంచి వచ్చిన ఆ వ్యక్తిని కలిసినవారు వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ ఏకే శ్రీవాస్తవ కోరారు. ఆరోగ్య శాఖ అధికారులు రోగితో పరిచయం ఉన్న ఇతర వ్యక్తులను కనుగొని జాబితాను సిద్ధం చేస్తున్నారు. రోగితో పరిచయం ఉన్న వ్యక్తులను కూడా విచారించనున్నట్లు ఓ అధికారి తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
మరోవైపు, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఆగ్రాలోని చాలా వరకు హోటళ్లు పూర్తిగా నిండిపోయాయి. తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు అధికారులు టెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులపై అధికారులు దృష్టిసారించారు. యూఎస్, చైనా, జపాన్, బ్రెజిల్, యూరోపియన్ దేశాల నుంచి తాజ్‌మహల్, ఆగ్రా ఫోర్ట్, అక్బర్ టోంబ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు అక్కడే కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.