Unlock4 Guidelines in Telugu: కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్ ప్రకటించడానికి వీల్లేదు. (రాష్ట్రం, జిల్లా, డివిజనల్, సబ్ డివిజన్, నగరం, గ్రామ స్థాయి వరకు)
కేంద్ర హోంశాఖ అన్ లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసింది.
2/ 12
మెట్రో రైలు సేవలు సెప్టెంబ్ర 7 నుంచి దశలవారీగా ప్రారంభం అవుతాయి. రైల్వే, కేంద్ర పట్టణాభివృద్ది, హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నడపాలి.
3/ 12
సెప్టెంబర్ 21 తర్వాత నుంచి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడా, వినోద, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధిత సభలు నిర్వహించుకోవచ్చు.
4/ 12
స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ సెప్టెంబర్ 30 వరకు మూసి ఉంటాయి.
5/ 12
ఆన్ లైన్, దూరవిద్య కొనసాగించవచ్చు.
6/ 12
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆన్ లైన్ క్లాసులు/ టెలి కౌన్సెలింగ్ నిర్వహించేటట్లయితే 50 శాతం వరకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను స్కూల్‌కు పిలవొచ్చు.
7/ 12
కంటైన్మెంట్ జోన్ల బయట ఉండే స్కూళ్లలో 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులను స్కూలుకు పిలవొచ్చు. అది కూడా తప్పనిసరి కాదు. వాలంటరీ మాత్రమే. అందుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనుమతి తప్పనిసరి.
8/ 12
స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ లాంటివి నిర్వహింవచ్చు.
9/ 12
సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌లు, ధియేటర్లు (ఓపెన్ ఎయిర్ ధియేటర్లు మినహా), మూసి ఉంటాయి.
10/ 12
కేంద్ర హోంశాఖ అనుమతించినవి మినహా ఇతర అంతర్జాతీయ ప్రయాణాలు నిషేధం
11/ 12
కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్ ప్రకటించడానికి వీల్లేదు. (రాష్ట్రం, జిల్లా, డివిజనల్, సబ్ డివిజన్, నగరం, గ్రామ స్థాయి వరకు)
12/ 12
రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లడానికి (వ్యక్తులు, వాహనాలు, గూడ్స్ వాహనాలు) ఎలాంటి కొత్త అనుమతులు అవసరం లేదు.