కేంద్ర హోంశాఖ అన్ లాక్ 3 గైడ్ లైన్స్ జారీ చేసింది. ఆగస్ట్ 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఆగస్ట్ 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్ ఉండాల్సిందే. ప్రజలు రాత్రి పూట బయట తిరగవచ్చు. రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత. అయితే, కరోనా నిబంధనలు పాటించాలి. ఆగస్ట్ 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్ లు ఓపెన్ చేయవచ్చు. కేంద్రం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. వందే భారత్ మిషన్ కింద మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు ఉంటాయి. మెట్రో రైళ్లు మూసి ఉంటాయి. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ధియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు మూసి ఉంటాయి. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. ప్రజలు రాష్ట్రంలో తిరగొచ్చు. ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లవచ్చు. గూడ్స్ వాహనాలకు కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవు.