కరోనా వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసినట్లుగానే భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి COVID-19 ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇన్ కొవాక్ టీకా (Incovacc Vaccine)ను ముక్కు ద్వారా అని పిలవబడే నాసిల్ డ్రాప్స్‌ని వైరస్ కట్టడికి బూస్టర్ డోస్‌గా దీన్ని తయారు చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 18 ఏళ్లు నిండిన వారు ఈ ముక్కు చుక్కల కరోనా వ్యాక్సిన్‌ను వేసుకోవ్చని ఆమోదించింది.కరోనా మొదటి రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోస్ కు అర్హులు. కోవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్న వారు అవే కంపెనీ బూస్టర్ టీకాలు తీసుకోవచ్చు. వాటికి బదులు నాసల్ టీకాను కూడా తీసుకోవచ్చు.
ఇన్ కొవాక్ టీకా (Incovacc Vaccine)ను ముక్కు ద్వారా రెండు చుక్కలు వేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య, టీకా కేంద్రాలకు ఇన్ కొవాక్ టీకాను రూ.325గా నిర్ధారించారు. జీఎస్టీ అదనం. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం దీని ధర రూ.800గా ఉంది. ఐతే ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. ఐదు శాతం జీఎస్టీ రూ.40తో పాటు రూ.150 మేర అడ్మినిస్ట్రేటివ్ చార్జీల కింద వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.(ప్రతీకాత్మకచిత్రం)
ఆ సమయానికి కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి.. మీ వివరాలు అందజేసి.. ప్రికాషన్ డోస్ తీసుకోవాలి. అనంతరం అదే కోవిడ్ యాప్ ద్వారా ప్రికాషన్ డోస్‌కి సంబంధించిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను డౌన్ లోడో చేసుకోవాలి. నాసల్ వ్యాక్సిన్ వద్దనుకుంటే.. గతంలో మీరు తీసుకున్న టీకానే తీసుకోవచ్చు.(ప్రతీకాత్మకచిత్రం)