ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి ఈనెల 16న సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారని.. అక్కడిని స్వస్థలం ఒంగోలుచేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 19న అతడికి టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా తేలిందని.. శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. అతని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులకు నెగెటివ్ వచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన మహిళకు, విశాఖపట్నంకు యువకుడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. వీరిలో ఒకరు కువైట్ నుంచి ఏపీకి రాగా.. మరొకరు యూఏఈ నుంచి వచ్చారు. ప్రస్తుతం వీళ్లిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు విజయనగరం, తిరుపతికి చెందిన వారికి ఒమిక్రాన్ గా తేలింది. (ప్రతీకాత్మకచిత్రం)