ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే టీటీడీ నుంచే ఆయుర్వేద మెడిసన్ అందుబాటులోకి వస్తుంది అని చెబుతోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందుపై పరిశోధన మొదలు పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం.
చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందుపై పరిశోధన మొదలు పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం అన్నారు. టీటీడీ ఆయుర్వేద విభాగంలో ఆనందయ్య మందును అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. (ICMR)అధ్యయనంలో సానుకూల ఫలితాలు వస్తే ఈ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకవేళ లేదంటే కనీసం ఇమ్యూనిటీ బూస్టర్లుగా వాడుతామన్నారు.
మరోవైపు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. అది ఆయుర్వేద మందు కాదని.. దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవీ ఇందులో పాటించట్లేదని ఆయన అభిప్రాయపడ్డారుర. అయితే ఈ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని… కాబట్టి ఇది అంత హానికరం కాదని కూడా ఆయుష్ కమిషనర్ స్పష్టం చేశారు. కంటిలో వేసే డ్రాప్స్లోనూ సాధారణ పదార్థాలే ఉపయోగిస్తున్నారని వెల్లడించారు.
ప్రజలు మాత్రం ఆనందయ్య మందు అద్భుతం అంటున్నారు. కరోనా లక్షణాలు ఉంటే ఇట్టే మాయమవుతున్నాయి అంటున్నారు. అందుకే భారీగా ఆ మందు కోసం జన్ క్యూ కడుతున్నారు. ఈ మందుకు రావాల్సిన అనుమతులు అన్నీ వస్తే టీటీడీ నుంచి ఆయుర్వేద మందుగా అందిస్తామంటున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఐసీఎం ఆర్ నివేదిక తరువాత పూర్తి అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.