వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండడంతో కేసులు కంట్రోల్ లోనే ఉణ్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 5773 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 838, పశ్చిమ గోదావరి జిల్లాలో 571, చిత్తూరు జిల్లాలో 569 కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్క జిల్లాలోనూ కేసుల సంఖ్య వేయి దాటలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.