Anandaiah Medicine: ఆనందయ్య మందు వేసుకుంటే కరోనా రాదా? టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు

సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఆనందయ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు అయితే మరో అడుగు ముందుకు వేసి.. తాను ఆనందయ్య మందు తీసుకున్నానని.. ఇప్పటి వరకు కరోనా రాలేదన్నారు.