AP Night Curfew Relaxations: ఏపీలో నైట్ కర్ఫ్యూ.., అర్ధరాత్రి వీటికే అనుమతి
AP Night Curfew Relaxations: ఏపీలో నైట్ కర్ఫ్యూ.., అర్ధరాత్రి వీటికే అనుమతి
శనివారం రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నైట్ కర్ప్యూ (Night Curfew) అమల్లోకి రానున్నందున ఏయే సర్వీసులను అనుమతిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న దష్ట్యా.. వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ విధించింది.
2/ 11
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి రోజూ రాత్రి 10గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.
3/ 11
కర్ఫ్యూ సందర్భంగా అన్ని రకాల కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయాల్సి ఉంటుంది.
4/ 11
అత్యవసర సేవలందించేందుకు ఆస్పత్రులు, ఫార్మసీ షాపు, డయాగ్నస్టిక్ ల్యాబ్ లు మాత్రమే కర్ఫ్యూ టైమ్ లో పనిచేసే వీలుంటుంది.
5/ 11
డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీసులు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చేవారికి అనుమతి ఉంటుంది.
6/ 11
వాటర్ సప్లై, శానిటేషన్ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ, ఫుడ్ సప్లై సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది.
7/ 11
పెట్రోల్ బంకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులు, టెలికమ్యునికేషన్ విభాగం, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కార్యాలయాలు కర్ఫ్యూ సమయంలో తెరిచేందుకు అవకాశముంది.
8/ 11
ప్రభుత్వం నిర్దేశించిన రంగాలు అంటే పోలీసులు, వైద్యులు, ఇతర రంగాలకు చెందిన వారు బయటకు వచ్చేందుకు మినహాయింపు ఉంది.
9/ 11
అలాగే నిత్యావసరాల రవాణా, అంతర్రాష్ట్ర సరుకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.
10/ 11
ప్రజారవాణాతో పాటు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను కర్ఫ్యూ సమయంలో నడపడానికి వీల్లేదు.
11/ 11
కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.