TELANGANA GOVT MAY LIFT LOCKDOWN CURBS ACROSS STATE FROM JUNE 20 HERE IS THINGS YOU SHOULD KNOW SK
Telangana Unlock: తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత? ఆ రోజు నుంచి మళ్లీ సాధారణ పరిస్థితులు
Telangana lockdown:
దేశంతో పాటు తెలంగాణలోనూ కరోనా ఉద్ధృతి తగ్గింది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా భారీగా తగ్గాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అన్లాక్ ప్రక్రియ ప్రారంభించింది. ఐతే కరోనా తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంతో పాటు తెలంగాణలోనూ కరోనా ఉద్ధృతి తగ్గింది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా భారీగా తగ్గాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అన్లాక్ ప్రక్రియ ప్రారంభించింది. ఐతే కరోనా తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ప్రస్తుతం తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఉంది. ఇక పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లేందుకు సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు సమయం ఇచ్చారు. 6 తర్వాత లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. జూన్ 19 వరకు ఇవే నిబంధనలు అమల్లో ఉంటాయి. (File Image)
3/ 7
ఐతే జూన్ 19 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఐతే విశ్వసనీయ సమాచారం మేరకు.. జూన్ 20 నుంచి తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోందట. కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే విధిస్తుందని సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఐతే స్కూళ్లు, కాలేజీలు, రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలపై మాత్రం ఆంక్షలు కొనసాగించే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
రాష్ట్రంలో కరోనా తగ్గుతుండడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుదలపై ప్రభుత్వం దృష్టిసారించింది. అటు వ్యవసాయ పనులు కూడా పుంజుకుంది. రైతులంతా విత్తనాలు వేస్తూ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాల వేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఈ నేపథ్యంలో ఆంక్షలను ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఐతే లాక్డౌన్ ఎత్తివేతపై జూన్ 19 లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మరుసటి రోజు నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ బిజీగా ఉంటారు. (ఫైల్ ఫోటో)
7/ 7
జిల్లా కలక్టరేట్లు, పోలీసు కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. మరి జూన్ 19న కేబినెట్ సమావేశం జరుగుతుందా? లేదంటే కేవలం ప్రెస్ నోట్తో మాత్రమే విడుదల చేస్తారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)