HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
TELANGANA GOVERNMENT TRANSFERRED RS 1500 TO WHITE RATION CARDHOLDERS KNOW IN WHICH BANK ACCOUNT MONEY DEPOSITED WITH THESE STEPS SS
ప్రభుత్వ సాయం రూ.1,500 ఏ అకౌంట్లో జమ అయిందో తెలుసుకోండిలా
Telangana Money Transfer | కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వైట్ రేషన్ కార్డ్ ఉన్నవారికి రూ.1500 చొప్పున జమ చేస్తోంది. అయితే ఆ డబ్బులు ఏ అకౌంట్లో జమ అయ్యాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు లబ్ధిదారులు. ఏ బ్యాంకు అకౌంట్లో జమ అయ్యాయో తెలుసుకోండి ఇలా.
News18 Telugu | May 15, 2020, 4:09 PM IST
1/ 7
1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.1,500 చొప్పున జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లబ్ధిదారులకు ఏప్రిల్, మే నెలల డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. తమ అకౌంట్లలో రూ.1,500 జమ అయ్యాయా? అసలు తాము లబ్ధిదారుల జాబితాలో ఉన్నామా లేదా అన్న సందేహాలు అనేక మందిలో ఉన్నాయి. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో సులువుగా తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకుంటే చాలు. స్టేటస్ తెలిసిపోతుంది. ఇందుకోసం మీ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు. గతంలో కేవలం జమ అయ్యాయో లేదో మాత్రమే తెలిసేది. ఇప్పుడు ఏ బ్యాంకులో జమ అయ్యాయో కూడా తెలుస్తోంది.
4/ 7
4. లబ్ధిదారులు ముందుగా https://epos.telangana.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఎడమవైపు ఉన్న లిస్ట్‌లో DBT Response Status Check పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. కొత్త పేజీలో ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులో మీరు ఏ నెలకు సంబంధించిన వివరాలు చెక్ చేయాలనుకుంటే ఆ నెల సెలెక్ట్ చేయండి. RC No లో మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Get Details పైన క్లిక్ చేయండి.
6/ 7
6. అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయో లేదో స్టేటస్ తెలుస్తుంది. ఒకవేళ జమ అయినట్టైతే ఏ బ్యాంకులో డబ్బులు జమ అయ్యాయో కూడా వివరాలు తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. బ్యాంకు అకౌంట్ లేనివాళ్లు పోస్ట్ ఆఫీసులో నగదు తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి మీ రేషన్ కార్డు కొత్త నెంబర్ చెప్పి, బయోమెట్రిక్ నమోదు చేసి రూ.1500 తీసుకోవచ్చు. నగదు తీసుకోవడానికి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మహిళ మాత్రమే వెళ్లాలి. (ప్రతీకాత్మక చిత్రం)