Telangana: ఆక్సీజన్ కోసం యుద్ధ విమానాలను పంపిన తెలంగాణ.. దేశంలోనే తొలిసారి

ఆక్సీజన్.. ఆక్సీజన్.. ఇప్పుడు దేశమంతటా దీని గురించే చర్చిస్తోంది. ఈ ప్రాణ వాయువు అందక కరోనా రోగులు తల్లడిల్లుతున్నారు. పలు ఆస్పత్రుల్లో ఊపిరి ఆడక పిట్టల్లా రాలిపోతున్నారు. ఈక్రమంలోనే ఆక్సీజన్ కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఆక్సీజన్ తయారీ ప్లాంట్‌ల నుంచి పరిశ్రమలకు ఆక్సీజన్ సరఫరా నిలిపివేసి... ఆస్పత్రులకు తరలిస్తున్నారు.