కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఫిబ్రవరి నెల జీతం వదులుకోవాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మున్సిపాలిటీలో ఉద్యోగులకు, సిబ్బంది సెల్ ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
గుంటూరు మున్సిపల్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు, ముఖ్యంగా శానిటరీ సిబ్బంది, ఇతరులు ఈ మెసేజ్ చూసి ఆందోళనకు గురయ్యారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఓ వైపు కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ అనేది వాలంటరీ అని చెబుతుంటే మరోవైపు అధికారులు ఇలా వ్యాక్సిన్ వేయించుకోకపోతే జీతం కట్ అని మెసేజ్లు రావడం వారిలో ఆందోళనకు గురి చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో వెంటనే అలాంటి మెసేజ్లు పెట్టొద్దని హెచ్చరించినట్టు తెలిసింది. ఆ మెసేజ్లు విత్ డ్రా చేసినట్టు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఏపీలో కరోనా వ్యాక్సిన్ లక్ష్యానికి తగినంత జరగడం లేదని టార్గెట్లో కేవలం 50 శాతం మాత్రమే అందుకున్నట్టు చెబుతున్న నేపథ్యంలో అధికారులు ఇలా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)