Corona Unemployment: కరోనా కష్టాల నుంచి భారత దేశం ఇప్పటిలో తేరుకునేలా కనిపించడం లేదు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ భయం వెంటాడుతూనే ఉంది. ఇంకా కొన్ని చోట్ల భారీగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓమిక్రాన్ కొత్త వేరియంట్ తరుముకొస్తోంది. ఇప్పటికే భారత్ లో ఎంటర్ అయ్యిందనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి.
తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు పెడుతున్నారు. కంటైన్మెంట్ జోన్ లలో మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లోనూ కఠిన ఆంక్షలు అమలవుతోంది.
ఆ భయాల సంగతి ఎలా ఉన్నా..? కరోనా తొలి, సెకెండ్ వేవ్ ల ప్రభావం ఇంకా తగ్గలేదు. కరోనా భయం, లాక్ డౌన్ కారణాలతో చాల వరకు వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. లక్షాలది కుటుంబాలు రోడ్డుపై పడ్డాయి. తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాయి చాలా కుటుంబాలు. ఇక చాలామంది ఉద్యోగాలను కోల్పోవలసి వచ్చింది. మరికొందరికి శాలరీల్లో కోతలు పడ్డాయి.
ప్రస్తుతం కరోనా పరిస్థి, ఉద్యోగాలపై కేంద్రం ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది. దేశంలో నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటన చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజు వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగారు. హర్యానాలోని భివానీ-మహేంద్రగఢ్ ఎంపీ ధరమ్వీర్ సింగ్ నిరుద్యోగం, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలకు సంబంధించి రాష్ట్రాల వారీ గణాంకాలను అడిగారు. ఎంపీ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
కేంద్ర మంత్రి ఇచ్చిన వివరణ ప్రకారం.. ఈ ఏడాది 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ‘నిరుద్యోగ రేటు’ 9.3 శాతానికి పెరిగిందన్నారు. గత ఏడాది 2020లో ఇదే త్రైమాసికంలో ‘నిరుద్యోగ రేటు’ 9.1 శాతమే. ఇవన్నీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా ‘నియమిత కాలిక శ్రామిక శక్తి సర్వే’ (పీఎల్ఎఫ్ఎస్) చెప్పిన లెక్కలే ఆయన లేఖలో వివరణ ఇచ్చారు.
మరోవైపు దేశంలోని నిరుద్యోగ స్థితిగతులను ఈ సర్వే రికార్డు చేస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెంటిలోనూ రకరకాల నిరుద్యోగాలు, వివిధ ఉద్యోగాలలో వస్తున్న వేతనాలు, పని గంటలకు సంబంధించిన సమాచారాన్ని ఈ సర్వేలో సేకరిస్తారు. స్త్రీ పురుషుల్లో ఎవరెంత నిరుద్యోగులో, మొత్తం మీద ‘నిరుద్యోగ రేటు(యూఆర్)’ ఎంతో లెక్కిస్తారు. సూక్ష్మ స్థాయిలో అయితే దేశంలో నిరుద్యోగ నిష్పత్తిని ఈ ‘యూఆర్’ సూచిస్తుంది.
నిరుద్యోగ సమస్య లెక్కలు చూసి భయపాడల్సిన అవసరం లేదన్నారు కేంద్రమంత్రి. దేశంలో ఉపాధి కల్పనను పెంచేందుకు భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది . ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన (ABRY) ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0లో భాగంగా సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి యజమానులను ప్రోత్సహించడానికి, COVID-19 మహమ్మారి సమయంలో ఉపాధి నష్టాలను భర్తీ చేయడానికి అక్టోబర్ 1, 2020 నుండి ప్రారంభించామన్నారు.
నిరుద్యోగ సమస్య లెక్కలు చూసి భయపాడల్సిన అవసరం లేదన్నారు కేంద్రమంత్రి. దేశంలో ఉపాధి కల్పనను పెంచేందుకు భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది . ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన (ABRY) ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0లో భాగంగా సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి యజమానులను ప్రోత్సహించడానికి, COVID-19 మహమ్మారి సమయంలో ఉపాధి నష్టాలను భర్తీ చేయడానికి అక్టోబర్ 1, 2020 నుండి ప్రారంభించామన్నారు.