SEVEN NEW CORONA VACCINES UNDER CLINICAL TRAIL SAYS UNION MINISTER HARSHAVARDHAN BA
7 New Corona Vaccines: కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు మరో ఏడు వ్యాక్సిన్లు
కరోనా వ్యాక్సిన్‌కు ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సీరం ఇన్ స్టిట్యూట్ అభివృద్ది చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ది చేసి కోవాగ్జిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, రాబోయే రోజుల్లో మరో ఏడు కరోనా వ్యాక్సిన్లను భారత్ ఉత్పత్తి చేస్తోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.
కరోనా వ్యాక్సిన్‌కు ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సీరం ఇన్ స్టిట్యూట్ అభివృద్ది చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ది చేసి కోవాగ్జిన్లు అందుబాటులో ఉన్నాయి.
2/ 6
అయితే, రాబోయే రోజుల్లో మరో ఏడు కరోనా వ్యాక్సిన్లను భారత్ ఉత్పత్తి చేస్తోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. కేవలం రెండు టీకాలపైనే ఆధారపడలేమని పేర్కొన్నారు.
3/ 6
130 కోట్ల మంది ఉన్న భారత్ దేశం కేవలం రెండు, మూడు వ్యాక్సిన్ల మీద ఆధారపడుకుండా మరిన్ని అభివృద్ది చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా పలు కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయన్నారు.
4/ 6
ఈ ఏడు వ్యాక్సిన్లలో మూడు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలోని ప్రతిఒక్కరికి టీకా అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
5/ 6
కరోనా వ్యాక్సిన్‌ను బహిరంగ మార్కెట్లో ఉంచేందుకు ప్రభుత్వం వద్ద తక్షణ ప్రణాళిక ఏమీ లేదని హర్షవర్ధన్ ప్రకటించారు. ఈ అంశంపై డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.
6/ 6
50 ఏళ్లకు పైబడినవారికి కరోనా టీకా పంపిణీని మార్చిలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ అత్యవసర ప్రాతిపదికన పూర్తి పర్యవేక్షణలో అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.