Corona Vaccine: అదే జరిగితే.. డిసెంబర్ నాటికే కరోనా వ్యాక్సిన్
Corona Vaccine: అదే జరిగితే.. డిసెంబర్ నాటికే కరోనా వ్యాక్సిన్
Corona Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి 2021లో పూర్తిస్థాయి అనుమతులు లభిస్తే దక్షిణ ఆసియా దేశాలకు, పేద దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అదార్ పూనవాలావెల్లడించారు.
కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. పలు కంపెనీలకు సంబంధించిన వ్యాక్సిన్లు దాదాపు సక్సెస్ అయ్యాయి. దీంతో చివరి దశ ట్రయల్స్ పూర్తయ్యే నాటికి ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పలు కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. (ప్రతీకాత్మక చిత్రం )
2/ 7
డిసెంబర్ నాటికి భారత్‌లో 10 కోట్ల డోస్‌ల కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆస్ట్రాజెన్‌కా వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం )
3/ 7
ప్రస్తుతం ఆస్ట్రాజెన్‌కా టీకా చివరి దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అదార్ పూనవాలా అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం )
4/ 7
కరోనా వైరస్‌ను ఈ టీకా సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడైతే.. అత్యవసర అనుమతి కింద వంద కోట్ల డోసులను డిసెంబర్ నాటికి ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం డోసులన్నీ భారత్‌కు వెళ్లనున్నాయని పూనవాలా తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం )
5/ 7
కొవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి 2021లో పూర్తిస్థాయి అనుమతులు లభిస్తే దక్షిణ ఆసియా దేశాలకు, పేద దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం )
6/ 7
ఇప్పటివరకు 40 మిలియన్ డోసుల ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు వివరించారు.(ప్రతీకాత్మక చిత్రం )
7/ 7
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అందరికీ వ్యాక్సిన్ అందడానికి 2024 వరకు సమయం పట్టే అవకాశం ఉందని అదార్ పూనవాలా తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం )