పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉంది. దీంతో ఈ వ్యాక్సిన్ ఎఫ్పుడు అందుబాటులోకి వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
తాజాగా దీనిపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) సీఈవో ఆదార్ పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. (ఫైల్ ఫోటో)
3/ 6
పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ కోవావ్యాక్స్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి రావొచ్చని తెలిపారు. జనవరి, ఫిబ్రవరి మధ్య దీన్ని తీసుకొస్తామని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఇది కూడా రెండు డోసుల వ్యాక్సిన్ అని తెలుస్తోంది. గత నెలలోనే 2 నుంచి 17 ఏళ్ల వయసున్న వారికి ఇచ్చే కోవావ్యాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
మరోవైపు వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం, ప్రధాని మోదీ ఇస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి ఇస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. (ఫైల్ ఫోటో)
6/ 6
పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన పూనావాలా.. ఆయనతో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపు, పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ తయారీ అంశాలపై చర్చించారు.(ప్రతీకాత్మక చిత్రం)