SECOND OMICRON DEATH REPORTED IN INDIA 73 YEARS OLD MAN DIED IN RAJASTHAN UDAIPUR SK
Omicron Deaths: దేశంలో రెండో ఒమిక్రాన్ మరణం.. ఏం జరుగుతోంది? పూర్తి వివరాలు
Omicron Deaths: భారత్‌ను ఒమిక్రాన్ వేరియెంట్ వణికిస్తోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. అంతేకాదు ఇప్పుడిప్పుడే మరణాలు కూడా నమోదవుతున్నాయి. నిన్న తొలి మరణం నమోదుకాగా.. ఇవాళ మరొకరు మరణించారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మన దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా నమోదవుతున్నాయి. దేశంలో రెండో ఒమిక్రాన్ నమోదయింది. రాజస్థాన్‌లో 73 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ఆయనకు ఒమిక్రాన్ పాజిటివ్ ఇటీవలే నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఉదయ్ పూర్‌కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు కరోనా బారినపడ్డాడు. కరోనా వచ్చినప్పటి నుంచీ అతడు ఆస్పత్రిలో ఉంటున్నాడు. డిసెంబరు 23న కరోనా నెగెటివ్ వచ్చింది. కానీ డిసెంబరు 25న ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
3/ 7
అనంతరం చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. పోస్ట్ కోవిడ్ న్యుమోనియా ప్రభావం వల్లే అతడ మరణించాడని వైద్యులు తెలిపారు. మృతుడికి రక్తపోటు, అధిక మధుమేహం సమస్యలు కూడా ఉన్నాయని రాజస్థాన్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇక దేశంలో ఒమిక్రాన్ నుంచి మొదటి మరణం మహారాష్ట్రలో నమోదైన విషయం తెలిసిందే. 52 ఏళ్ల ఒమిక్రాన్ సోకిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. డిసెంబర్ 28న ఈ వ్యక్తి మరణించినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
నైజీరియా నుంచి తిరిగి వచ్చిన అతను.. పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని యశ్వంత్ చవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. 13 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నట్లు అధికారులు బులెటిన్‌లో తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
కాగా, మన దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యి దాటాయి. కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఇప్పటి వరకు 23 రాష్ట్రాల్లో 1,270 కేసులు వచ్చాయి. ఇప్పటికే 374 మంది కోలుకోగా.. ఇద్దరు మరణించారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. అక్కడ 450 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 320 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో, 109 కేసులతో కేరళ మూడో స్థానంలో నిలిచింది. 62 కేసులతో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)