1. మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోగ్య సంజీవని పాలసీని అందిస్తోంది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI రూపొందించిన స్టాండర్డ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఇది. ఈ పాలసీని అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఒక ఏడాది పాలసీ క్లెయిమ్ చేసుకోకపోతే 5% బోనస్ లభిస్తుంది. అంటే మీరు రూ.5,00,000 పాలసీ తీసుకుంటే ఒక ఏడాది పాలసీ క్లెయిమ్ చేయకపోతే వచ్చే ఏడాది నుంచి 5% బోనస్‌తో కలిపి రూ.5,25,000 కవరేజీ లభిస్తుంది. ఇలా పాలసీ బ్రేక్ చేయకుండా రెన్యువల్ చేసుకుంటూ పోతే గరిష్టంగా 50% వరకు బోనస్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎస్బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం వివరాలు చూస్తే రూ.5,00,000 లక్షల పాలసీకి 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి రూ.4400 ప్రీమియం చెల్లించాలి. 35 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి రూ.5311 ప్రీమియం, 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి రూ.6181 ప్రీమియం చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఐసీయూ, ఐసీసీయూ ఖర్చుల కోసం పాలసీ కవరేజీలో 5% లేదా రోజుకు రూ.10,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సర్జన్, అనెస్తెటిస్ట్, స్పెషలిస్ట్, బ్లడ్, మెడికల్ ప్రాక్టీషనల్, కన్సల్టెంట్ ఫీజులన్నీ కవర్ అవుతాయి. సర్జికల్ ఎక్యూప్మెంట్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఇందులో కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)