HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
RUSSIA APPROVED SECOND CORONA VIRUS VACCINE EPIVACCORONA AK
Corona Vaccine: రష్యా దూకుడు.. మరో కరోనా వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్
EpiVacCorona Vaccine: ఎపీవ్యాక్కరోనా వ్యాక్సిన్‌ను మనుషులపై పెద్ద ఎత్తున ప్రయోగాలు చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. నవంబర్ లేదా డిసెంబర్లో ఈ ప్రక్రియ మొదలుకానుంది.
News18 Telugu | October 14, 2020, 9:01 PM IST
1/ 9
వ్యాక్సిన్ సైబీరియాలోని వెక్టార్ ఇన్స్టిట్యూట్లో రూపొందించారు. ప్రాథమిక స్థాయిలో మనుషులపై ప్రయోగం కూడా గతం నెలలోనే పూర్తయ్యింది. అయితే ఇందుకు సంబంధించి ఫలితాలను మాత్రం రష్యా వెల్లడించలేదు. ఫేజ్ 3 ట్రయల్స్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం )
2/ 9
రెండో కరోనా వ్యాక్సిన్‌కు రష్యా అనుమతి మంజూరు చేసింది. అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.. ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు.(ప్రతీకాత్మక చిత్రం )
3/ 9
మొదటి వ్యాక్సిన్‌తో పాటు రెండో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని పుతిన్ అన్నారు. ఇందుకు సంబంధించి విదేశాలకు సహకరించడంతో పాటు తమ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసుకుంటామని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం )
4/ 9
ఎపీవ్యాక్ కరోనా పేరుతో రష్యా రెండో వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వంద మంది వాలంటీర్లపై దీన్ని ప్రయోగించారు.(ప్రతీకాత్మక చిత్రం )
5/ 9
ఇప్పటికే మాస్కోకు చెందిన గమాలియా ఇన్స్టిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను రష్యా ఆగస్టులో ఆమోదించింది.(ప్రతీకాత్మక చిత్రం )
6/ 9
ప్రస్తుతం స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఫేజ్ ట్రయల్స్ కోసం రిజిస్టర్ చేశారు. దాదాపు 40 వేల మందిపై మాస్కోలో ఇందుకు సంబంధించి ప్రయోగాలు కొనసాగుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం )
7/ 9
ఎపీవ్యాక్కరోనా వ్యాక్సిన్‌ను మనుషులపై పెద్ద ఎత్తున ప్రయోగాలు చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. నవంబర్ లేదా డిసెంబర్లో ఈ ప్రక్రియ మొదలుకానుంది.(ప్రతీకాత్మక చిత్రం )
8/ 9
30 వేల మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు జరగొచ్చని అంచనా. అందులో 5 వేల మంది సైబీరియాకు చెందిన వారే ఉంటారని రష్యాకు చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం )
9/ 9
కరోనాకు విరుగుడుగా తయారవుతున్న మరో వ్యాక్సిన్‌ను సంబంధించిన ట్రయల్స్‌ను 300 మందిపై ఈ నెల 19 నుంచి ప్రారంభించనున్నారు. దీన్ని సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన చుమకోవ్ సంస్థ తయారు చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం )