కరోనా విజృంభణతో సాధారణ జనాలు మాస్క్‌లు వాడటం ప్రారంభించారు. అయితే కరోనా కట్టడికి మనం వాడుతున్న మాస్క్‌ల విషయంలో చాలా గందరగోళం నెలకొంది. మార్కెట్లో అనేక రకాల మాస్క్‌లు అందుబాటులో ఉండటంతో.. వాటిలో ఏ రకమైన మాస్క్‌లు కరోనా కట్టడికి బాగా పనిచేస్తాయనే విషయంపై స్పష్టత కొరవడింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
అయితే బహిరంగ ప్రదేశాలలో ఏదో ఒక రకమైన మాస్క్ వాడటం తప్పనిసరి అని నిపుణులు చెప్పారు. అయితే ఇప్పటికీ.. క్లాత్ మాస్క్‌లు వాడకంపై కొన్ని అపోహలు ఉన్నాయి. క్లాత్ మాస్క్‌లను వాష్ చేసి వినియోగించడం వల్ల.. వైరల్ కణాలను ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుందనే ప్రచారం కూడా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అయితే తాజాగా క్లాత్ మాస్క్‌లు ఎంతకాలం ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయనే దానిపై ఏరోసోల్ అండ్ ఎయిర్ క్వాలిటీ (Aerosol and Air Quality)రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం క్లారిటీ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
క్లాత్ మాస్క్‌లు ఒక సంవత్సరం వరకు ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆ అధ్యయనం పేర్కొంది. క్లాత్ మాస్క్‌లను ఉతకడం, ఎండబెట్టడం వల్ల వైరల్ కణాలను ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని తగ్గదని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
‘ఇది ఒక శుభవార్త. మీరు కాటన్ మాస్క్.. వాషింగ్ తర్వాత కూడా వాడుతున్నారా..? అది ఇంకా బాగానే ఉంటే.. దాన్ని విసిరేయవద్దు’అని అమెరికా కొలరాడో బౌల్డర్(Colorado Boulder) విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టడీ లీడ్ రచయిత మెరీనా వాన్స్ (Marina Vance) అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
క్లాత్ మాస్క్‌లను క్రమంగా వాష్ చేయడం ద్వారా బట్ట యొక్క వడపోత సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేయలేదని పరిశోధకులు కనుగొన్నారు. వైరస్ ప్రయాణించే 0.3 మైక్రాన్ల అతి చిన్న కణ పరిమాణాలను.. క్లాత్ మాస్క్‌లు 23 శాతం వరకు ఫిల్టర్ చేయబడ్డాయని అధ్యయనంలో కనుగొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)