RAJASTHAN GOVERNMENT FIXED THE MAXIMUM RATE FOR RAPID ANTIGEN TEST OF COVID 19 AT RS 50 IN PRIVATE TESTING LABORATORIES SK
Covid-19: గుడ్ న్యూస్.. రూ.50కే కరోనా టెస్ట్.. కోవిడ్ ఉందో లేదో ఇంటి వద్దే చెక్ చేసుకోవచ్చు
Corona test at Rs.50: మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ విరుచుకుపడుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 11 శాతానికి పైగా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది కరోనా పరీక్షలు చేయించుకునేందుకు పరుగులు పెడుతున్నారు. అలాంటి వారికి శుభవార్త. కరోనా టెస్ట్ ధరలు భారీగా తగ్గాయి.
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెస్ట్‌లను పెంచి కోవిడ్ బాధితులను ట్రేస్ చేసే దిశగా.. రాష్ట్రంలో కరోనా ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్ట్ ధరలను భారీగా తగ్గించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్ట్ ధరలనురూ.50గా ఖరారు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం ఈ టెస్ట్‌లను ఉచితంగానే చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్ట్ కిట్ ధరలను తగ్గించి ప్రజలకు ఊరట కలిగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
కోవిడ్ టెస్ట్‌ల కోసం పరీక్షా కేంద్రాల వద్ద క్యూ కడితే కరోనా వ్యాప్తి జరిగే అవకాశముందని.. అందుకే ఎవరి ఇంట్లో వారు కోవిడ్ పరీక్షలు చేసుకునేందుకు వీలుగా ర్యాపిడ్ టెస్ట్ కిట్ ధరలను తగ్గించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
కాగా, బుధవారం నాటి కరోనా బులెటిన్ ప్రకారం.. రాజస్థాన్‌లో 6,366 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 853 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. నలుగురు మరణించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో 30,597 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)