Omicron: గుడ్‌న్యూస్.. ఆ టాబ్లెట్‌తో ఒమిక్రాన్ వేరియెంట్ మటాష్.. అద్భుతమైన ఫలితాలు
Omicron: గుడ్‌న్యూస్.. ఆ టాబ్లెట్‌తో ఒమిక్రాన్ వేరియెంట్ మటాష్.. అద్భుతమైన ఫలితాలు
Omicron: ఒమిక్రాన్ వేరియెంట్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 77 దేశాలకు విస్తరించి అందరిలో వణుకు పుట్టిస్తోంది. డెల్టా కంటే అధికంగా వ్యాప్తి చెందుతోందని WHOహెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒమిక్రాన్‌కు సంబంధించి ఓ శుభవార్త చెప్పింది ఫైజర్ కంపెనీ.
ఒమిక్రాన్ వేరియెంట్‌పై ఫైజర్ టాబ్లెట్ అద్భుతంగా పనిచేస్తోందని ఆ కంపెనీ తెలిపింది. కోవిడ్-19 చికిత్స కోసం తాము ప్రయోగాత్మకంగా రూపొందించిన యాంటీవైరల్ మాత్ర కరోనాలోని ఒమిక్రాన్‌పై సమర్థంగా పనిచేస్తోందని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2,250 మందిపై అధ్యయనం నిర్వహించగా అందులో సానుకూల ఫలితాలు వచ్చాయి. వైరస్ ముప్పు అధికంగా ఉన్నవారు లక్షణాలు కనిపించిన వెంటనే.. ఈ టాబ్లెట్ తీసుకుంటే ఆస్పత్రిలో చేరాల్సిన పనిలేదు. మరణాల బారినపడటం కూడా 89 శాతం మేర తగ్గినట్లు వెల్లడయింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఫైజర్ టాబ్లెట్ తీసుకున్న వారిలో వైరస్ స్థాయి 10 రెట్లు తగ్గినట్లు తేలింది. విడిగా ల్యాబ్‌లో చేసిన మరో పరీక్షలోనూ ఒమిక్రాన్ వేరియంట్‌పైనా ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించామని సైంటిస్టులు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
పునరుత్పత్తి కోసం ఒమిక్రాన్ వేరియెంట్ ఉపయోగించే కీలక ప్రొటీన్‌ను కృత్రిమంగా తయారుచేసి, దానిపై ఈ మాత్రను ప్రయోగించామని.. దానిపై ఫైజర్ మాత్ర బాగా పనిచేసిందని పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఫైజర్ టాబ్లెట్‌తో పాటు మెర్క్ సంస్థ రూపొందించిన మరో ఔషధాన్ని కోవిడ్ చికిత్స కోసం అనుమతిచ్చే అంశంపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
కరోనా వైరస్‌లోని మునుపటి వెర్షన్లతో పోలిస్తే ఒమిక్రాన్ ఎక్కువగా వ్యాప్తి చెందినప్పటికీ... ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువేనని దక్షిణాఫ్రికాలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఐనప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఒమిక్రాన్ వేరియెంట్ 77 దేశాలకు విస్తరించింది. యూకే, డెన్మార్క్, సౌతాఫ్రికాలో అత్యధిక కేసులు ఉన్నాయి. మనదేశంలో ఇప్పటి వరకు 57 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)