CoronaVirus Vaccine: రష్యన్ వైద్య అధికారి ఒకరు తమ పౌరులను స్పుత్నిక్ వి వ్యాక్సిన్ టీకాలు వేసిన తరువాత రెండు నెలల పాటు మద్యం సేవించకుండా ఉండాలని సూచించారు.
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయి. కొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి సంబంధించి ఆమోదం కూడా లభించింది. మరికొద్ది వారాల్లోనే మన దేశంలోనూ ఈ వ్యాక్సిన్లకు అలాంటి అనుమతులు వచ్చే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం )
2/ 6
సాధారణంగా వ్యాక్సిన్ల తీసుకునేవాళ్లు తమ ఆహార, వ్యక్తిగత అలవాట్లు పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో మాత్రం కొన్ని నిబంధనలు పాటించాల్సి వస్తుందేమో అనే ప్రచారం సాగుతోంది.(ప్రతీకాత్మక చిత్రం )
3/ 6
ఇందుకు అసలు కారణం రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తీసుకునే వారికి ఆ దేశ వైద్య అధికారి ఒకరు పలు సూచనలు చేయడమే.(ప్రతీకాత్మక చిత్రం )
4/ 6
రష్యన్ వైద్య అధికారి ఒకరు తమ పౌరులను స్పుత్నిక్ వి వ్యాక్సిన్ టీకాలు వేసిన తరువాత రెండు నెలల పాటు మద్యం సేవించకుండా ఉండాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం )
5/ 6
కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకునే సమయంలోనే మద్యానికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతుందని.. టీకా తీసుకున్న తరువాత కొంతకాలం మద్యం తీసుకోకపోడమే మంచిదని అక్కడి అధికారి స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం )
6/ 6
అయితే ఈ ప్రతిపాదనపై చాలామంది రష్యన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల్లో రూపొందిన కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి ఇలాంటి నిబంధనలేమీ లేకపోయినా.. రష్యాలోని మందుబాబులకు మాత్రం కరోనా వ్యాక్సిన్ చేదు వార్త తెచ్చిపెట్టింది.(ప్రతీకాత్మక చిత్రం )