HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
OVER USE OF HAND SANITISERS AND SOAPS CAN DAMAGE YOUR HANDS SAYS EXPERTS NK
Handwash Tips : అతిగా చేతులు కడుగుతున్నారా? మరో వ్యాధి సోకే ప్రమాదం...
Handwash Tips: కరోనా వచ్చాక చాలా మంది చేతులు కడుక్కోవడంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఐతే... మరీ అదే పనిగా చేతులు కడుక్కుంటూ ఉంటే... ప్రమాదమే.
News18 Telugu | October 27, 2020, 3:22 AM IST
1/ 3
కరోనా రాకుండా తీసుకునే జాగ్రత్తల్లో హ్యాండ్ వాషింగ్ ముఖ్యమైనది. ఎందుకంటే... మనం రకరకాల వస్తువుల్ని ముట్టుకుంటాం. వాటిపై కరోనా వైరస్ ఉంటే... అది మన చేతులకు అంటుకుంటుంది. అందువల్ల ప్రతి 2 గంటలకు ఓసారి చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఐతే... ఇప్పుడు మన దేశంలో చేతులు కడుక్కోవడం బాగా ఎక్కువైపోయింది. ప్రతి గంటకూ, మాటిమాటికీ కడిగేసుకుంటున్నారు చాలా మంది. ఏది ముట్టుకున్నా... అమ్మో కరోనా అంటుకుందేమో... ఎందుకైనా మంచిది అని వెళ్లి చేతులు కడిగేసుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2/ 3
మన చేతులపై మంచి బ్యాక్టీరియా ఉంటుంది. మనం అదే పనిగా కడిగేస్తే... అది చచ్చిపోతుంది. అందుకే మాటిమాటికీ శానిటైజర్, సబ్బుల్ని వాడకూడదు. అదీ కాక... అబ్సెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) అనే మానసిక సమస్య అలవాటవుతుంది. ఈ OCD అనే లక్షణం ఏర్పడితే... అప్పుడు జీవితాంతం... ప్రతీదీ మళ్లీ మళ్లీ కడుగుతూనే ఉంటారు. ఎంత క్లీన్ చేసుకున్నా... ఇంకా ఇంకా చెయ్యాలనే ఆలోచనే ఉంటుంది. అందుకే ఈ OCD రాకుండా చూసుకోవాలి.
3/ 3
చాలా మంది మాటిమాటికీ శానిటైజర్ వాడుతున్నారు. అది కూడా మంచిది కాదు. శానిటైజర్లో రకరకాల కెమికల్స్ ఉంటాయి. అవి మన చేతులకు అంటుకొని... మనం ఏదైనా తిన్నప్పుడు... వాటితోపాటూ... బాడీలోకి వెళ్లి... వికారం తెప్పిస్తాయి. అందువల్ల శానిటైజర్ కంటే సబ్బు వాడటమే మేలంటున్నారు నిపుణులు. ఈ శానిటైజర్ ఎక్కువగా వాడితే... చర్మం పొడిబారిపోతుంది. కారణం అందులో ఉండే ఆల్కహాలే. చర్మం పొడిబారితే... తిరిగి దాన్ని తేమగా మార్చుకోవడానికి మళ్లీ మాయిశ్చరైజర్లు వాడాల్సి ఉంటుంది. ఇదంతా తలనొప్పి వ్యవహారం. ఈ సమస్య లేకుండా... సబ్బైనా, శానిటైజరైనా అవసరం అయినప్పుడు మాత్రమే వాడితే ఇబ్బంది ఉండదు.