భారత దేశాన్ని కరోనా మహహమ్మారి వణికిస్తోంది. ప్రతి రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా పది రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాలో కఠిన ఆంక్షలు అమలు అవుతున్నాయి. అయినా కరోనా కట్టడి కావడం లేదు. ముఖ్యంగా దేశంలో సెకెండ్ వేవ్ కారణంగా ఆక్సిజన్, ఔషధాలకు బాగా కొరత ఏర్పడింది. దీంతో ఇటీవల సముద్ర సేతు 2 మిషన్ ను ముమ్మరం చేసింది భారత దేశం.
దేశ వ్యాప్తంగా కరోనా రోగులు ఆసుపత్రులలో మరణిస్తున్నారు. వారికి సరైన సమయంలో ఆక్సిజన్, ఇతర ఔషదాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు, అత్యవసర మందుల రవాణాకు భారత నౌకాదళం ఇటీవల ప్రారంభించిన సముద్ర సేతు 2 మిషన్ సక్సెస్ య్యింది. మొత్తం మూడు నేవల్ కమాండ్ల నుంచి 9 యుద్ధ నౌకలు భారత్ కు కావాల్సిన ఆక్సిజన్ ను తీసుకొచ్చాయి.
ఈ నెల 5 న సింగపూర్ లో బయలుదేరిన యుద్దనౌక ఐ ఎన్ ఎస్ ఐరావత్ ఇవాళ విశాఖ తీరం చేరుకుంది. ఆపరేషన్ సముద్ర సేతు- 2 లో భాగంగా కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న 9 నౌకలలో ఐ ఎన్ ఎస్ ఐరావత్ ఒకటి. ఆపరేషన్ సముద్ర సేతు-II లో భాగంగా గల్ఫ్, ఆగ్నేయ ఆసియా లోని ఫ్రెండ్లీ దేశాలనుంచి మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ తో పాటు వైద్యపరికరాలను ఐరావత్ తీసుకొచ్చింది. కోవిడ్-19 చికిత్సలో ఎదురవుతున్న ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇలా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సింగపూర్, యూఏఈల నుంచి అత్యధిక సామర్థ్యం గల ట్యాంకర్లను కొనుగోలు చేస్తోంది. ఆయా దేశాలతో జరిపిన చర్చలు ఫలించడంతో క్రయోజినిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు మన దేశానికి చేరుకుంటున్నాయి.
దేశంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు భారత నౌకాదళం ఈ పనిని తన భుజాన పెట్టుకుంది. ఆపరేషన్ సముద్ర సేతు-2 పేరుతో విదేశాల నుంచి ఆక్సిజన్ క్రయోజనిక్ కంటెయినర్లతో సహా అనుబంధ వైద్య పరికరాలను యుద్దనౌకల ద్వారా భారత్కు చేరవేస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ నుంచి విశాఖ కు సముద్రం మార్గం గుండా ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ద నౌకలు చేరుకున్నాయి.