Lockdown Extended: లాక్ డౌన్ పొడిగింపు.. దుకాణాలకు స్వల్ప మినహాయింపులు.. జూన్ 15 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్..
Lockdown Extended: లాక్ డౌన్ పొడిగింపు.. దుకాణాలకు స్వల్ప మినహాయింపులు.. జూన్ 15 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్..
Lockdown Extended: హర్యానా ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది. జూన్ 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపింది. అయితే ఈ సారి కొన్ని సడలింపులను కల్పించారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
జూన్ 7వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం వెల్లడించింది. దుకాణాలకు స్వల్ప మినహాయింపులు కల్పించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
వివిధ వర్గాల నుంచి వస్తున్న వినతులపై చర్చించి కాస్త సడలింపులు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ జూమ్ ద్వారా మీడియా సమావేశంలో ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు దుకాణాలు తెరచుకునేందుకు అనుమతిచ్చారు. అయితే సరి-బేసి విధానంలో దుకాణాలు తెరచుకోవాలని కొత్త నిబంధన పెట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యా సంస్థలను జూన్ 15 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
కరోనా నిబంధనలు ప్రతీ ఒక్కరు పాటించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.(ప్రతీకాత్మక చిత్రం )