Omicron Variant: భారత్‌లో 37కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయంటే..
Omicron Variant: భారత్‌లో 37కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయంటే..
Omicron Variant: భారత్‌లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలకూ ఈ వైరస్ వేరియెంట్ విస్తరిస్తోంది. ఇవాళ కూడా మరో ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఇండియాలో ఎన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు వచ్చాయి? ఎంత మంది దాని బారినపడ్డారో ఇక్కడ తెలుసుకుందాం.
మన దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నాలుగు కేసులు వచ్చాయి. ఏపీ, చండీగఢ్, కర్నాటక, మహారాష్ట్రలో ఒక్కో కేసులు వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసు నమోదవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఐర్లాండ్ నుంచి ముంబై మీదుగా వైజాగ్‌కు వచ్చిన ఓ 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియెంట్ నిర్ధారణ అయింది. నవంబరు 27న కరోనా పాజిటివ్ రావడంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. అతడిని డిసెంబరు 11న మరోసారి టెస్ట్ చేయగా కోవిడ్ నెగెటివ్ వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
నవంబరు 22న 20 ఏళ్ల ఓ యువకుడు ఇటలీ నుంచి చండీగఢ్‌కు వచ్చాడు. డిసెంబరు 1న కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
ఇటీవల సౌతాఫ్రికా నుంచి కర్నాటకకు వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ నిర్ధారణ అయింది. ప్రభుత్వ ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. అతడిని కలిసిన ఐదుగురితో పాటు మరో 15 మంది సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
నాగ్‌పూర్‌లో కూడా తొలి ఒమిక్రాన్ కేసు వచ్చింది. ఇటీవల సౌతాఫ్రిక నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయిందని నాగ్‌పూర్ మున్సిప్ కమిషనర్ రాధాక్రిష్ణన్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
మనదేశంలో ఇప్పటి వరకు 36 కేసులు వచ్చాయి. కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ఏపీ, చండీగఢ్‌లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికం మహరాష్ట్రలోనే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఒమిక్రాన్ వేరియెంట్ 59 దేశాలకు విస్తరించింది. యూకే, డెన్మార్క్, సౌతాఫ్రికాలో అత్యధిక కేసులు ఉన్నాయి. ఇదీ వేగంగా విస్తరిస్తున్నా.. తీవ్రత మాత్రం తక్కువే అంటున్నారు వైద్య నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం)