Omicron: ఆ రెండు దేశాల్లో ఒమిక్రాన్ విలయ తాండవం.. సౌతాఫ్రికా కంటే ఎక్కువ కేసులు
Omicron: ఆ రెండు దేశాల్లో ఒమిక్రాన్ విలయ తాండవం.. సౌతాఫ్రికా కంటే ఎక్కువ కేసులు
Omicron Variant: ఒమిక్రాన్ వేరియెంట్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మొదట సౌతాఫ్రికాలో బయటపడిన ఈ వైరస్ ఇతర దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ఐతే పలు దేశాల్లో మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా కంటే అక్కడే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పుడు అందరిలోనూ ఒమిక్రాన్ వేరియెంట్ గురించే ఆందోళన కనిపిస్తోంది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
WHO హెచ్చరికల నేపథ్యంలో అన్ని దేశాలూ అప్రమత్తమవుతున్నాయి. ఒమిక్రాన్ కేసు మొదట బయటపడిన సౌతాఫ్రికాతో పాటు పలు దేశాలకు రాకపోకలు నిలిపివేస్తున్నాయి. మరికొన్ని దేశాల ప్రయాణికులపై ఆంక్షలను విధిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఒమిక్రాన్ నేపథ్యంలో అందరూ సౌతాఫ్రికా గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ దక్షిణాఫ్రికా కంటే ఎక్కువ కేసులు వస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. అవే యూకే, డెన్మార్క్.. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
సౌతాఫ్రికాలో ఇప్పటి వరకు 255 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. కానీ యూకేలో 440 మంది బాధితులున్నారు. డెన్మార్క్‌లో 398 మందికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకింది. అమెరికాలో 55 కేసులుండగా.. ఇండియాలో 23 మంది దీని బారినపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఈ రెండు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. కరోనా ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. మాస్క్‌లను తప్పనిసరిచేశాయి. అటు వ్యాక్సినేషన్ కూడా వేగవంతం చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఐతే ఒమిక్రాన్ వేరియెంట్ గురించి ఇటీవలే వైద్యనిపుణులు ఊరటనిచ్చే విషయాన్ని చెప్పారు. ఇది అత్యంత వేగంగా వ్యాపించే వైరస్ అయినప్పటికీ.. డెల్టా వేరియెంట్‌తో పోల్చితే అంత ప్రమాదకరమేమీ కాదని చెబుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)