Omicron: ఒమిక్రాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. స్కూల్స్ మూసివేయాల్సిందేనా?
Omicron: ఒమిక్రాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. స్కూల్స్ మూసివేయాల్సిందేనా?
Omicron variant: భారత్‌లో ఒమిక్రాన్ వణుకు మొదలయింది. బెంగళూరులో రెండు కేసులు నమోదవడంతో అన్ని రాష్ట్రల్లోనూ అలజడి నెలకొంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనూ కలకలం రేగింది. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ ఆమెకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బాధితురాలిని టిమ్స్‌లో అడ్మిట్ చేసి.. జినోమ్ సీక్వెన్స్ కోసం నమూనాలు ల్యాబ్‌కు పంపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఒకవేళ ఆమెకు ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని ఆమెకు ఒమిక్రాన్ అని తేలితే హైదరాబాద్‌లో కొన్ని ఆంక్షలు విధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
వారం క్రితం వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాల్లో రోజుకు 50 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఒమిక్రాన్ బయటపడిన తర్వాత.. రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరిగి వందకు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ నేపథ్యంలో నగరంలో కరోనావైరస్ మళ్లీ ప్రభావం చూపిస్తోందా? అని అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే హైదరాబాద్‌లో ఫేస్ మాస్క్‌ను తప్పనిసరి చేశారు. లేదంటే రూ.1000 జరిమానా విధిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
స్కూళ్లలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పటాన్‌చెరులోని ఓ స్కూల్లో 25 మంది విద్యార్థులు కరోనాన బారిన పడ్డారు. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులను గుంపులు గుంపులుగా కూర్చోబెడుతున్నారు. మాస్కులు కూడా ధరించడం లేదు. అందుకే కేసులు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
నగరంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశిస్తే పరిమిత ఆంక్షలు విధించే అవకాశముంది. కేసుల సంఖ్య పెరిగితే స్కూళ్లను మూసివేసి... మళ్లీ ఆన్లైన్ క్లాసులకే మొగ్గు చూపనున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఒమిక్రాన్ నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఏర్పాట్లపైనా అధికారులు దృష్టిసారించారు. గాంధీలో ప్రస్తుతం 1800 పడలకలు ఉండగా.. అందులో 120 మాత్రమే కరోనా రోగులకు కేటాయించారు. ఒకవేళ ఒమిక్రాన్ కేసులు పెరిగితే.. వాటికి అనుగుణంగా పడకల సంఖ్యను పెంచుతామని వైద్యాధికారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)