Omicron Tension In India: కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం తగ్గింది అనుకుంటే.. కొత్త వేరియంట్ ఇప్పుడు మళ్లీ భయపెడుతోంది. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. మన దేశంలోనూ చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది.
ప్రస్తుతం మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 87కి పెరగడం ఆందోళన పెంచుతోంది. తాజాగా ఈ ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కర్నాటకలో 8, తెలంగాణలో 7, ఢిల్లీలో 10, మహారాష్ట్రలో 32, రాజస్తాన్ లో 17, కేరళలో 5, గుజరాత్ లో 5, ఏపీ, తమిళనాడు, బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒమిక్రాన్ కేసు నమోదైంది.
ఇక ప్రపంచ దేశాల్లో చూసుకుంటే.. ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో ఒమిక్రాన్ విలయతాండవం చేస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయి. లండన్, మాంచెస్టర్ లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. యూరప్‌లోని ఇతర దేశాల్లో సైతం కరోనా వణుకు పుట్టిస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఇప్పటివరకు 22వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు సమాచారం. మొత్తం 77 దేశాలకు ఒమిక్రాన్ పాకింది.
కరోనా సెకెండ్ వేవ్ ముప్పు మానవాళిని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. రూపం మార్చుకున్న కొవిడ్ రాకాసి.. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కలవరం మొదలైంది. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అని లేదు.. దేశమంతా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన కొందరు రాత్రిళ్లు విపరీతమైన చెమటతో బాధపడుతున్నా రని అన్నారు. ఒమిక్రాన్ బారిన పడిన వారిలో భిన్న మైన లక్షణాలు కన్పిస్తున్నాయని వైద్యులు గుర్తించారు. కొవిడ్ 19 సాధారణ లక్షణాలైన దగ్గు, తరచూ ముక్కు కారడం , గొం తు నొప్పి , తీవ్రమైన జ్వ రం వం టివి కొత్త వేరియం ట్ బాధితుల్లో లేవు.