Omicron: వణికిస్తున్న ఒమిక్రాన్.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు
Omicron: వణికిస్తున్న ఒమిక్రాన్.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు
Omicron Virus:
కరోనా వైరస్ మళ్లీ కల్లోలం రేపుతోంది. కొత్త రూపంలోకి మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మిగతా దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి.
ఒమిక్రాన్‌ను ఆందోళనకర వేరియెంట్‌గా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. డెల్టా వేరియెంట్ కంటే ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తోంది.ఈ నేపథ్యంలో ఆగ్నేయాసియా దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు.
2/ 6
ఒమిక్రాన్ వ్యాప్తిపై నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని WHO తెలిపింది. కొవిడ్ వ్యాక్సినేషన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
వైరస్ ముప్పు నుంచి రక్షణ పొందేందుకు ప్రతిఒక్కరూ ముక్కు, నోటిని కప్పి ఉంచేలా మాస్కులు ధరించాలి. చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వెలుతురులేని గదులకు దూరంగా ఉండాలి. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
పండుగలు, ఇతర వేడుకల్ని కరోనా నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలి. అందరూ భౌతికదూరం పాటించాలి. జనసమూహాలకు దూరంగా ఉండాలి. కరోనా నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదు.
5/ 6
ఆగ్నేయాసియా ప్రాంత జనాభాలో 31శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. 21శాతం మంది ఒక డోస్ మాత్రమే వేసుకున్నారు. ఇంకా 48శాతం మంది ఇంకా టీకా వేయించుకోవాల్సి ఉందని పూనం ఖేత్రపాల్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు ఒమిక్రాన్ ముప్పు అధికంగా ఉంటుందని డబ్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. (ప్రతీకాత్మక చిత్రం)