కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. మన దేశంలో కూడా విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఒమిక్రాన్ చాలా ప్రాణాంతకం కానప్పటికీ, దాని సంక్రమణ రేటు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం )