తాజాగా ఒమిక్రాన్ సోకిన వారి శాంపిల్స్‌ను హైదరాబాద్ సీసీఎంబీకి పంపించగా.. మంగళవారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. ఒమైక్రాన్ బాధితుల్లో కృష్ణా జిల్లాకు చెందిన వారు ముగ్గురు, పశ్చిమ, జిల్లాలకు చెందిన ఇద్దరేసి చొప్పున ఉన్నట్టు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి మెరగ్గానే ఉందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ హైమావతి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిని కొత్త వేరియంట్ భయపెడుతోంది. దివాన్ చెరువులో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరికి ఒమైక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఇటీవల వీరు చాలామందిని కలిసినట్టు తెలుస్తోంది. దీంతో వారి ప్రైమరీ కాంటక్ట్ లపై అధికారులు ఆరా తీస్తున్నారు.. మరికొన్ని కేసులు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
అలాగే తూర్పు గోదావరి జిల్లాల్లోని కొత్తపేట మండలం అవిడి గ్రామానికి మస్కట్ నుంచి వచ్చిన మహిళ కూడా ఒమైక్రాన్ బారిన పడ్డారు. ముగ్గురు ఒమైక్రాన్ బాధితులు బయటపడటంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయో అన్ని ప్రాంతాలను మైక్రో కంటెయిన్మెంట్ జోన్ లు గా చేసి.. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ఒమైక్రాన్ బాధితుల కాంటాక్ట్‌లను గుర్తించి.. వారి కూడా కొవిడ్ పరీక్షలు
నిర్వహిస్తున్నారు. అయితే అందులో కొందరికి పాజిటివ్ నిర్ధారణ అయినా.. అది ఒమిక్రాన్ అనే తేలడానికి సమయం పడుతోంది. ఓ వైపు ఓమ్రికాన్ కేసులు రెట్టింపు అవతున్నాయి. మరోవైపు సాదారణ కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో థర్డ్ వేవ్ ఎంటరయ్యిందా అనే భయం కలుగుతోంది..