ప్రజలను వణికిస్తున్న కరోనా.. టీటీడీ ఉద్యోగులను కూడా భయపెడుతోంది. లాక్డౌన్ తరువాత శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతించింది టీటీడీ. అప్పటి నుంచి పలువురు టీటీడీ ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం )
2/ 6
తిరుమలలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డ టీటీడీ ఉద్యోగుల సంఖ్య 1572కు చేరింది. వీరిలో 1403 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం )
3/ 6
ప్రస్తుతం 169 మంది ఉద్యోగులు చికిత్స తీసుకుంటుండగా... ఇప్పటివరకు కోవిడ్ కారణంగా చనిపోయిన టీటీడీ ఉద్యోగుల సంఖ్య ఐదుకు చేరింది.(ప్రతీకాత్మక చిత్రం )
4/ 6
ఇక ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించే విషయంలో టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.(ప్రతీకాత్మక చిత్రం )
5/ 6
ఇదిలా ఉంటే ఆర్జిత సేవా టికెట్ల విషయంలో దళారుల మాటలు నమ్మవద్దని టీటీడీ విజిలెన్స్ శాఖ సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం )
6/ 6
కరోనా కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారని తెలిపింది. అధికారిక వెబ్సైట్లోనే సేవా టికెట్లు పొందాలని స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం )