దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేసే దిశగా కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని గతంలో వార్తలు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే తాజాగా దీనిపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇన్ ఇండియా (ఎన్‌టిఎజిఐ) సభ్యుడు డాక్టర్ జయప్రకాష్ ములియల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు కరోనా టీకాలు వేయాల్సిన అవసరం లేదని అన్నారు. చిన్నారులు బాగానే ఉన్నారని, ఇప్పుడు టీకాలు వేయాల్సిన అవసరం లేదని ప్యానెల్ కేంద్రానికి తెలియజేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
కోవిడ్ -19 కారణంగా 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో భారతదేశం ఒక్క మరణాన్ని కూడా చూడలేదని దేశంలోని ప్రముఖ ఎపిడెమియాలజిస్టులలో ఒకరైన ములియల్ తెలిపారు. డిసెంబరు 8న జరిగిన సమీక్షా సమావేశం తర్వాత.. అనేక కంపెనీలు ఇంకా శాస్త్రీయ ట్రయల్స్‌ను నిర్వహించే ప్రక్రియలో ఉన్నాయని NTAGI తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)