కరోనా కట్టడికి నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో పకడ్బందీ చర్యలు...

కరోనా వైరస్ ను కట్టడిచేసే చర్యల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ తో కలిసి ఈ రోజు నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో పర్యటించారు. ప్రయాణికుల టికెట్ కౌంటర్ దగ్గర, క్యూలైన్లో దూరం పాటించాల్సిందిగా సూచించారు. ప్లాట్‌ఫామ్స్ శానిటేషన్, రైల్వే కోచ్ లను శుభ్రంగా ఉంచాలని స్టేషన్ మాస్టర్ ను ఆదేశించారు.