Andhra Pradesh Night Curfew: ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. రోజువారి కేసుల సంఖ్య కొన్ని నెలల తరువాత మళ్లీ ఆరు వేల మార్కును దాటింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఒకటి రెండు రోజుల్లోనే నిత్యం నమోదయ్యే కేసుల సంఖ్య పది వేల మార్కును దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో కఠినంగా నైట్ కర్ఫ్యూనను అమలు చేస్తున్నారు. ఇప్పటికే తొలిరోజు కర్ఫ్యూ పూర్తైంది.
అయితే నైట్ కర్ఫ్యూ తొలిరోజు కొన్ని జిల్లాల్లా అక్కడక్కడా ప్రజలు రోడ్లపైనే కనిపించారు. వారిని ఆపిన పోలీసులు.. తొలి వార్నింగ్ గా లు హెచ్చరించారు. మరోసారి రోడ్డుపై కనిపిస్తే ఫైన్లు విధిస్తామని హెచ్చరించారు.. ఎంత పని ఉన్నా.. 11 గంటల లోపు ఇంటికి చేరుకోవాల్సిందే అని.. లేదంటే జరిమానాలు తప్పవని హెచ్చరించి పంపించేశారు..
ఏపీలో నైట్ కర్ఫ్యూ ప్రారంభమైంది. రాత్రి 11 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగాయి. కొన్ని జిల్లాల్లో ప్రజలు అప్రమత్తమై.. 11 గంటలు దాటిన తరువాత ఎవరూ రోడ్లపైకి రాలేదు.. అత్యవసర సర్వీసుకు చెందిన వారు తమ ఐడీకార్డులతో అక్కడక్కడ పదొకొండు గంటల దాటిన తరువాత రోడ్లపై కనిపించారు.. దాదాపు అన్ని రోడ్లు చాలా వరకు నిర్మాణుష్యంగానే కనిపించాయి.
కరోనా కొత్త ఆంక్షలు ఇవే..
ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్కులు ధరించాల్సిందే.. గడప దాటి కాలు బయట పెడితే మాస్కు పెట్టుకోవడం మరిచిపోవద్దు.. అలా కనిపిస్తే వందరూపాయల జరిమానా వేస్తారు. ఇక షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై 10 వేల నుంచి 25 వేల రూపాయల వరకు వరకు జరిమానా విధిస్తారు. నైట్ కర్ఫ్యూ అమలు కాని సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి అనుమతి ఇచ్చారు. అలాగే ఇండోర్ ప్రదేశాల్లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంది..
సినిమా థియేటర్లపై ఆంక్షలు ఇవే..
నిన్నటి నుంచి సినిమాథియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపిస్తున్నారు. అలాగే సినిమా హాల్స్ లో సీటు వదిలి సీటు విధానాన్ని పాటిస్తున్నారు. థియేటర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకులు మాస్కు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో థియేటర్లు కొత్త టైమింగ్ ను అమలు చేస్తున్నాయి. ఇవే కొత్త సినిమా టైమింగ్స్ అంటూ థియేటర్ల వద్ద డిస్ ప్లే బోర్డులు కూడా పెట్టారు.
మార్కెట్లు, షాపింగ్ మాల్స్ దగ్గర ఆంక్షలు
మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే జరిమానాతో పాటు ఒకటి లేదా రెండు రోజులపాటు షాపులు, మార్కెట్లు మూసివేసేలా చర్యలు ఉంటాయి. మార్కెట్ అసోసియేషన్లు, యాజమాన్యాలు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి.
అత్యవసర సేవలకు మినహాయింపు.. ఈ నైట్ కర్ఫ్యూలో అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చింది. . ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఫార్మా, మెడికల్, ఐటి, ఇంటర్నెట్, పెట్రోల్, నీటి సరఫరా, విద్యుత్ వంటి విభాగాలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. సిబ్బంది తప్పని సరిగా ఐడి కార్డ్ దగ్గర ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.