NEW MORE INFECTIOUS CORONAVIRUS STRAIN NOW DOMINATES GLOBAL CASES STUDY SK
డేంజర్ బెల్స్.. కరోనా గురించి మరో సంచలన విషయం చెప్పిన సైంటిస్టులు
కరోనా వైరస్ గురించి అమెరికా శాస్త్రవేత్తలు మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. రోజురోజుకీ కరోనా వైరస్ జన్యుక్రమంలో వస్తున్న పరివర్తనంతో మనుషులకు సోకే సామర్థ్యం మరింత మెరుగుపడుతోందని గుర్తించారు. ఈ మేరకు జర్నల్ సెల్ అనే మ్యాగజైన్లో పరిశోధకులు తమ అధ్యయనాన్ని ప్రచురించారు.
జర్నల్ సెల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కొవిడ్-19కు కారణమవుతున్న కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ అనేక రకాలుగా ఏర్పడుతోంది. వీటిలో డీ614జీ అనేది ఓ రకం. (credit - NIAID)
2/ 9
డీ614జీ రకం వైరస్‌కు మనుషులకు సోకే సామర్థ్యం భారీ స్థాయిలో ఉన్నట్లు ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ రకాలలో దీనిదే సింహభాగం.
3/ 9
డీ614జీని మొట్టమొదటిసారి ఏప్రిల్‌లో పరిశోధకులు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన జన్యుక్రమాలను పరిశీలిస్తుండగా.. ఈ రకం తరచూ తారసపడడంతో దీనిపై విస్తృత పరిశోధనలు జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
4/ 9
దీనిపై పరిశోధనలకు నేతృత్వం వహించిన అమెరికాలోని లాస్ అలమోస్ నేషనల్ ల్యాబోరేటరీకి చెందిన బెట్టీ కోర్బర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
5/ 9
ప్రపంచవ్యాప్తంగా క్షేత్ర స్థాయిల్లో కరోనా అసలు రూపం విజృంభిస్తుండగానే.. డీ614జీ ప్రవేశించి ప్రబలరూపంగా మారిందని ఆయన తెలిపారు.
6/ 9
డీ614జీ ప్రస్తుత రూపం వ్యాధిని తీవ్రం చేయడం లేదని, మానవ కణాల్లోకి ప్రవేశించేందుకు దోహదపడుతున్న స్పైక్ ప్రొటీన్ డీ614జీలో ప్రభావవంతంగా మార్పు చెందడమే దీనికి కారణమని చెప్పారు.
7/ 9
అలాగే శ్వాసకోశ వ్యవస్థ పైభాగంలో ఈ వైరస్ భారీ స్థాయిలో ఉంటున్నట్లు గుర్తించారు. దీని వల్ల ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు(credit - NIAID)
8/ 9
వైరస్ రూపాంతరం వల్ల ఏర్పడుతున్న ముప్పును గుర్తించేందుకు మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
9/ 9
ఇప్పటి వరకు జరిపిన పరిశోధనల్లో వైరస్ పరివర్తన రేటు చాలా తక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.