ఈ స్టడీ వివరాలను 'సెల్' అనే జర్నల్‌లో ప్రచురించారు. దాని ప్రకారం.. చైనాలోని గబ్బిలాల్లో మొత్తం 24 రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు. అందులో నాలుగు వైరస్లు SARS-CoV-2 ఉన్నాయి. వీటిలో RpYN06 అనే వైరల్ శాంపిల్.. పూర్తిగా సార్స్-కొవ్-2ను పోలి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.స్పైక్ ప్రోటీన్‌పై ఉండే జన్యు క్రమం మాత్రమే కొంచెం వేరుగా ఉందని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
2020 జూన్‌లో థాయ్‌లాండ్‌లోనూ సార్స్-కొవ్-2ను పోలిన కొన్ని కరోనా వైరస్‌ను గుర్తించినట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాటితో పాటు తాజాగా యునాన్ ప్రావిన్స్‌లో గుర్తించిన వైరస్‌లను పరిగణనలోకి తీసుకుంటే... కరోనా వైరస్ గబ్బిలాల్లోనే సంచరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)