NEW CORONA VIRUS STRAIN DETECTED IN SRI LANKA WHICH WILL SPREAD FASTLY COMPARED TO PREVIOUS VIRUS AK
New Corona Virus: మరో కొత్త రకం కరోనా.. వ్యాప్తి ఎక్కువ.. ఇండియాకు పక్కనే..
New Corona Virus: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌కు కొత్త రకంగా కరోనా స్ట్రెయిన్లతో పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడం కూడా కారణమే అని పలువురు నిపుణులు చెబుతున్నారు.
దేశంలో కరోనా వ్యాప్తి వేగానికి అసలు కారణం కొత్త స్ట్రెయిన్లా లేక ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడమా అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. (ప్రతీకాత్మక చిత్రం )
2/ 6
అయితే భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌కు కొత్త రకంగా కరోనా స్ట్రెయిన్లతో పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడం కూడా కారణమే అని పలువురు నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం )
3/ 6
ఇదిలా ఉంటే తాజాగా భారత్‌కు పొరుగున ఉండే శ్రీలంకలో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించారు అక్కడి శాస్త్రవేత్తలు. మునుపటి కరోనాతో పోలిస్తే ప్రస్తుతం దీని ప్రభావం, వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం )
4/ 6
ఇది గాల్లో దాదాపు గంట సేపు పైనే మనుగడ సాగించగలదని శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం )
5/ 6
ఇటీవల దేశంలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఎక్కువ యువత కరోనా బారిన పడుతున్నారని అన్నారు. రాబోయే 2-3 వారాలలో తరువాతే నిజమైన పరిస్థితి బయటపడుతుందని ఆయన అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం )
6/ 6
మరోవైపు శ్రీలంక కూడా అనేక దేశాల మాదిరిగానే , కరోనా కేసుల సంఖ్యను నివారించలేకపోతోంది. ప్రస్తుత శ్రీలంకలో కేసుల సంఖ్య 99,691 ఉండగా, 638 మరణాలు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం )