కరోనా మహమ్మారి (Corona Virus) విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అనివార్యమైంది. మహమ్మారిని ఎదుర్కొవాలంటే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. ఈ కమ్రంలో నెట్ వర్క్18 మరియు ఫెడర్ బ్యాంక్ చొరవతో కొవిడ్-19 వ్యాక్సినేషన్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తోంది.
దేశంలోని పలురాష్ట్రాల్లో అవగాహాన కార్యక్రమాలు నిర్వహించిన నెట్ వర్క్ 18.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) లోనూ ప్రత్యేక వాహనం ద్వారా వ్యాక్సినేషన్ పై ప్రచారం నిర్వహించింది. జూన్ 4వ తేదీన గుంటూరులో ప్రారంభమైన సంజీవని అవగాహన కార్యక్రమం.. ఏడు నెలలుగా కొనసాగుతోంది.