కరోనా వైరస్ మళ్లీ రూపాంతరం చెందినట్లు రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మాస్కో సిటీలో ఈ కొత్త కరోనా వైరస్ వెలుగు చూడడంతో.. దానిని మాస్కో స్ట్రెయిన్‌గా పిలుస్తున్నారు. ఈ స్ట్రెయిన్‌తో రష్యాలో మళ్లీ భారీగా కరోనా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతునన్నారు.
ఐతే ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్‌పై స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందా? వైరస్‌ను ఏ మేర అడ్డుకుంటుందన్న దానిపై శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనిపై స్పుత్నిక్ వీ టీకా సమర్థవంతంగానే పనిచేస్తుందని విశ్వసిస్తున్నట్లు గమలేయా నేషనల్ సెంటర్ హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం - image credit - NIAID)